పిలల్ల డిమాండ్స్ భరించలేనంతగా ఉంటున్నాయని వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో అర్ధం కావటం లేదని తల్లులు బాధపడుతూవుంటారు నిజమే. ఒక వస్తువు కొనిపెట్టగానే ఇంకో వస్తువు లిస్ట్ లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఒక వీడియో గేమ్ కొనిస్తే సరిగ్గా ఇంటి గడపైనా ఎక్కకముందే ఇంకో ప్లే స్టేషన్ అంటారు. బడ్జెట్ గురించి వాళ్లకు ఎలాంటి అవగాహన ఉండదు. డబ్బు లేవురా అని ఓ తల్లి నచ్చజెప్పబోతే పోనీ డబ్బులు కొనూ అన్నాట పిల్లవాడు. ఇలాగె ఉంటుంది వ్యవహారం కానీ కొన్ని చర్యలు వాళ్లకు చెప్పాలి. పిలల్లకు తరచూ డబ్బులిచ్చి వాటితో ఎదో ఒకటి కొనుక్కోమని చెపొద్దు. పాకెట్ మనీ కూడా దాచుకునేలా అలవాటు చేసుకోవాలి. అసలు పిల్లలతో డబ్బు గురించ్బి మాట్లాడాలి కదా. మన బడ్జెట్ ఇదీ మన సేవింగ్స్ వాళ్లకు చెప్పటం బెటర్. పుట్టిన రోజులు పండగలు వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకున్న సమయాలను కూడా డబ్బులిచ్చి సంతోషం చూపెట్టకూడదు. వాళ్లకు ఉపయోగపడే వస్తువులు సంతోషపెట్టాలి.
Categories