ఇన్ని ఫ్యాషన్స్ గురించి డ్రెస్ కోడ్ గురించి ఎన్నెన్నో చదువుతూ వుంటాం. కానీ అసలు ఆడవాళ్లు ఎలా కనపడితే బావుంటారు అన్న దాని పైన ఓ చిన్న సర్వే రిపోర్ట్ ఒకటి వచ్చింది. 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉండే చదువుకున్న ఉద్యోగంలో ఉన్న కార్పొరేట్ రంగంలో ఉన్న మహిళలు సమాధానాలు ఇచ్చిన తీరును బట్టి ఫ్యాషన్ స్టేట్మెంట్ ని నిర్ణయించి రిపోర్ట్ ఇచ్చారు. నీట్ గా చక్కని డ్రెసింగ్ తో ఉండాలి. పరిశుభ్రంగా కనిపించాలి. ఫ్యాషన్ కదా అని ఏది బడితే అది శరీరం తీరును గమనించుకోకుండా వేసుకోకూడదు. వస్త్ర ధారణ లోనే అసలు వ్యక్తిత్వం కనిపించాలి. పాదాలు నీట్ గా ఉండాలి ముఖం తో పాటు మెడ కూడా శుభ్రంగా ముఖం లాగ ఉంచాలి. చర్మం రంగు ఏదైనా ఆరోగ్యంగా మెరుపులీనుతూ ఉండాలి. తళుక్కున మెరిసిపోనక్కర్లేదు. కానీ జిడ్డు కారుతూ నిర్లక్ష్యపు అప్పీయరెన్స్ తో మాత్రం జీరో మార్కులే . నవ్వులో నడకలో హుందా తనం ఉట్టిపడాలి. మాటలో మృదుత్వం ఉండాలి. జుట్టు చెదిరిన పర్లేదు కానీ సందర్భానికి తగిన విధంగా శిరోజాలంకరణ ఉండాలి . ఫ్రెండ్లీగా సానుకూలంగా మాట్లాడే ధోరణి అసలైన అందం. మనసులో కల్మషం లేని ప్రేమ పూర్వక ఆదరణతో కూడిన నవ్వే మొఖానికి వజ్రాల కాంతుల అందం.
Categories