Categories
Wahrevaa

ఎన్నెన్నో విశేష గుణాలున్న మునగాకు.

మునగ కాయల సాంబారు, చారు అద్బుతంగా ఉంటాయి కానీ ఎప్పుడైనా మునగాకు పప్పు రుచి చూశారా? మునగాకుతో ఇప్పుడు టాబ్లెట్లు, క్యాప్సుల్స్, ఫౌడర్ వంటి డైట్ సప్ప్లిమెంట్లు తయారు చేస్తున్నారు. దీన్ని నీడలో ఆరబెట్టి ఆకుపచ్చ రంగు పోకుండా ఎన్నో వ్యాధులకు మందులుగా తయారు చేస్తున్నారు. ఈ సర్వరోగ నివారిణి గా  మునగాకును కూరల్లో, ఎండబెట్టిపొడిగా చేసి ఇతర దినుసులతో కలిపి కూర చేసుకుంటారు. మునగాకు లో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, పీచు, విటమిన్ A, B1, B2, B3, B5, B6, విటమిన్ C, E, K లతో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. మునగాకు బాలింతలకు, పాలు తాగే పిల్లలకు ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదంలో ఏకంగా చెప్పారు. మునగాకు కంటి చూపుకు, చర్మ సౌందర్యాన్ని మెరుగు పరచడమే కాకుండా జుట్టు రాలడం అరికడుతుంది. ఇన్ని ఔషధ గుణాలున్న మునగాకు తప్పనిసరిగా వీలైనన్ని కూరల్లో, పప్పులో వాడుకోండి.

Leave a comment