బరువు తగ్గండిజ్ఞాపక శక్తి పెరగకపోతే మమ్మల్ని అడగండి అంటున్నారు  శాస్త్రజ్ఞులు బరువుకి, జ్ఞాపక శక్తి చాలా దగ్గర సంబంధం ఉంటుదన్నారు. బరువు నియంత్రణలో వుంటే అల్జీమర్స్ ప్రమాదం ఉంటుందంటున్నారు. ఈ విషయాన్ని రుజువు చేస్తున్నారు కుడా. బరువు ఎక్కువగా వున్న వారు తక్కువ బరువు వున్న వారి తో పోలిస్తే ఏదైనా విషయాన్ని గబుక్కున గుర్తు చేసుకోలేకపోతున్నారు. ఎత్తు వయస్సులకు తగినట్లు బరువును నియంత్రణలో ఉంచుకుంటే చురుకుదనం బాగా వుంటుంది. అంటే బరువు తగ్గడం వల్ల ఆరోగ్యం బావుండటమే కాదు మానసిక బలం పెరిగి జ్ఞాపకశక్తి మెరుగు పడుతుందన్నారు పరిశోధకులు.

Leave a comment