నిహారికా, ఒక ఫెయిల్యూర్ ఏదైనా సరే నన్ను డిస్ట్రబ్ చేస్తుంది. నన్ను నిలువెల్లా నీరసించేలా చేస్తుంది అన్నావు కదా. కానీ అపజయం లోంచి విజయానికి పునాదులు పడతాయి అంటారు ఎక్స్పర్ట్స్. బాలీవుడ్ యాక్టర్ షారుక్ ఖాన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నా దృష్టిలో వైఫల్యం ఒక కొలమానం. నా సినిమా బాక్సాఫీసు వద్ద దెబ్బతిన్న ప్రతిసారి నేను కష్టపడటం నేర్చుకొన్నాను. మరింత వైవిధ్యంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచవలసిన అవసరాన్ని అర్ధం చేసుకొన్నాను. అధికారం, ఆస్తులు సర్వం పోగొట్టుకొన్నప్పుడు మనకున్న వందమంది మిత్రుల్లో అసలైన స్నేహితులు ఒకరో, ఇద్దరో తెలుసుకోగలుగుతాము. కష్టంలో నిలబడిన వాళ్ళే స్నేహితులు కదా! నువ్వు నమ్మిన మార్గంలో ధైర్యంగా ప్రయాణించడమే అసలైన గెలుపు అంటాడు స్టీవ్ జార్జ్. ఎక్కడో ఓడిపోయావని ఎవడో చెపితే వినకూడదు. మన మనసు చెపితే వినాలి. అప్పుడు ఎందుకు ఓడిపోయమో సరిగ్గా బేరీజు వేసుకొని మరు నిమిషం వెళ్ళవలసిన జాడల్లో ప్రయోగo మొదలు పెడితే అసలైన విజయపథం చేరేది. అప్పుడు విజయాన్ని ఆపే శక్తి దేనికీ వుండదు విజయం తధ్యమన్నమాట.
Categories