![](https://vanithavani.com/wp-content/uploads/2016/10/smita-sabarwal-1_0.jpg)
స్మితా సబర్వాల్ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్లో హ్యాండ్స్ ఫర్ హ్యాండ్స్ అనే సంస్థను స్థాపించారు. ఈ ఎన్జీవో సొంతంగా పనిచేయదు. 12 స్వచ్చంద సంస్థలకు సాయం చేస్తుంది. ఒక స్వచ్చంద సంస్థకు సొంత భవనాన్ని కట్టించారు. 60 మంది పిల్లల చదువు బాధ్యతను తీసుకున్నారు. కొన్ని స్వచ్చంద సంస్థల పని భారం తగ్గించేందుకు నెలవారి సరుకులు 52 రకాలు అందిస్తారు. పిల్లలకు స్కూల్ ఫీజులు కడతారు, యూనిఫామ్స్, స్టేషనరి అందిస్తారు. ఇలా 12 స్వచ్చంద సంస్థల పనుల్లో భాగస్వాములుగా ఉన్నారు. స్మితా సబర్వాల్ వంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటే మరెంతోమందికి రెండు చేతులా సాయం దొరుకుతుంది. హ్యాండ్స్ ఫర్ హ్యాండ్స్ యూనిఫామ్ కోడ్ నీలం టీ షర్ట్ బ్లూ ప్యాంటు. ఈ వినూత్నమైన సేవా మార్గం అందరికీ ఆదర్శం.