మనోరమ ఇండస్ట్రీస్ చైర్ పర్సన్ వినీత సరాఫ్ చత్తీస్ ఘడ్ లో స్పెషాలిటీ కొవ్వుల వ్యాపారం నడిపిస్తారు. గుగ్గిలం గింజలు, మామిడి టెంకలు కోకోవా షియా విత్తనాలతో చేసే ఈ కొవ్వులను చాక్లెట్ల తయారీలో బాడీ లోషన్స్ తయారీ లో ఉపయోగిస్తారు. 80 లక్షల మంది గిరిజన మహిళలు అడవుల్లోని వ్యర్థాలను సేకరించి మాకు ఇస్తారు. వాటి సహకారంతో మా ఇండస్ట్రీ నడుస్తోంది అంటారు వినీత. అడవుల్లోని ఈ వ్యర్ధాలే లక్షల మందికి ఉపాధి ఇవ్వటంతో పాటు కొవ్వు తీసేసిన తర్వాత మిగిలే తేలిక పిండి వంటి పదార్థం చక్కని పశుగ్రాసం అందుకే మా సంస్థ అత్యుత్తమ పర్యావరణహిత సంస్థగా ఎన్నో అవార్డులు గెలుచుకుంది అంటారు వినీత.

Leave a comment