Categories
33 మంది మహిళలున్న అరుదైన డ్యాన్స్ ట్రూప్ పేరు ‘కేజీబీ 84’ ఈ ట్రూప్ లో ఉన్న వారంతా 80 ఏళ్ళు దాటిన వాళ్ళే. జపాన్ లో ఉన్న ఈ డ్యాన్స్ ట్రూప్ అంటే యువతలో కూడా గొప్ప క్రేజ్.80 ఏళ్ళు దాటితేనే ఈ డ్యాన్స్ ట్రూప్ లోకి ప్రవేశం. తైవాన్ కు 240 కి.మీ దూరంలో ఉన్న చిన్న ద్వీపం కుహామా కు చెందింది ఈ డ్యాన్స్ ట్రూప్. ఈ బామ్మల డ్యాన్స్ ట్రూప్ ను చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్యే ప్రతి ఏటా పెరుగుతూనే ఉంటుందట. ఈ ట్రూప్ లో ఉన్న వాళ్ళంతా ఒకే చోట ఉంటారు. ప్రదర్శనల ద్వారా వచ్చే ఆదాయం అదే ద్వీపంలో ఉండే అనాధశరణాలయానికి ఇస్తారట. బావుంది కదా.