నీహారికా , పుస్తకాలూ చదవాలనే ఉంటుంది కానీ చదివే టైం లేదు అంటుంటావు . ఇది కేవలం సాకు అనచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది అంటుంటారు అనుభవజ్ఞులు. రోజుకు ఒక పుస్తకం కేవలం 15, 20 నిముషాలు చదవలేమా ? సాధారణంగా మనం నిమిషానికి వంద పదాలు చదవగలం. అంటే 15 నిముషాలు 1500 పదాలు అంటే ఒక పుస్తకంలో నాలుగైదు పేజీలు ఈజీగా చదవచ్చు. అంటే ఎంత తీరిక లేకపోయినా ఎలాగోలా చదివినా నెలకు 15 0 పేజీలు చదవచ్చు . ఎంతో జ్ఞానం సంపాదించవచ్చు. రోజుకు పదో పదిహేనో నిముషాలు ఎంత మాత్రం చెప్పు. ఈ ప్రపంచంలో మన కళ్ళ ఎదురుగ కనిపించే దేవతలు పుస్తకాలూ అన్నాడో ప్రసిద్దుడు. ఒక సంస్కారం లేనివాడిని సంస్కారవంతుడిగా ఒక దుర్మార్గుడిని మంచివాడిగా మార్చగలిగే గొప్ప శక్తి పుస్తకానికి వుంది. చదవటం వల్ల మన గురించి మన చరిత్ర గురించి మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎన్నో తెలుసుకోవచ్చు చదువు కోవటం అదే ఆదిభితమైన విలువైన పుస్తకాలూ చదవటం వల్ల వచ్చే విజ్ఞానం గురించి తలుచుకుంటే తప్పకుండా చదివే సమయం దొరుకుతుంది. మనకు తెలియకుండా ఒక మంచి పుస్తకం మన పైన చూపించే ప్రభావం చాలా ఎక్కువ.
Categories