పరుగు పెడితే మోకాళ్ళు తిరిగి పోతాయంటారు చాలా మంది కానీ ప్రతి రోజూ కాసేపన్నా పరుగు పెడితేనే మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు అంటారు అమెరికా పరిశోధకులు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల స్త్రీ పురుషుల పైన ఈ పరిశోధనలు నిర్వహించారు. ముఖ్యంగా ఇందులో సగం మంది మోకాలి దగ్గర వాపు ఉన్నవారే . అరగంట పరుగులు పెట్టేస్తే వాపు కనిపించకుండా పోయింది. అంతకు ముందు నొప్పులతో ఉన్న అవస్థ కూడా తగ్గుమొహం పట్టిందట. ప్రతిరోజు అరగంట పరుగుపెట్టటం లేదా వేగంగా నడవటం వల్ల  మోకాలి వాపుకు కారణం అయ్యేలా CYTOKINS  అనే రసాయనం కనపడకుండా పోయిందిట. 30 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ప్రత్యేకంగా ఈ అరగంట పరుగు మానకుండా ఉండాలనీ భవిష్యత్తులో మోకాళ్ళు నొప్పుల బారిన పడకుండా ఉండాలంటే ఇప్పటినుంచే ఈ పరుగు తీయటం ప్రారంభించాలని వారు సూచనలిస్తున్నారు. ఆలాగైతేనే వార్ధక్యంలో వచ్చే కాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ కాకుండా ఉంటుందంటున్నారు. అంటే వయసులో వున్నప్పుడే ఈ ఆరోగ్య పరుగుని మొదలుపెట్టాలన్నా మాట.

 

Leave a comment