సాధారణంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తమ మెటర్నిటీ సెలవులను జాగ్రత్తగా లెక్కపెట్టి తొమ్మిదవ నెల వచ్చే వరకు పని చేస్తారు. ఇలా చేయటం వల్ల  ప్రసవం తర్వాత బిడ్డతో ఎక్కువగా గడిపేందుకు  వీలవుతుందని కష్టం ఓర్చుకుని పని చేస్తారు. కానీ ఉద్యోగినులు తమ ఆలోచన మార్చుకుని తీరాలి. ఆరవ నెల దాటిన దగ్గర నుంచి ఎక్కువ సేపు కూర్చోవటం రాత్రి పూత పొద్దుపోయే వరకు పనిచేయటం వంటివి గర్భస్థ శిశువుకు ఇబ్బంది పెడతాయి. పైగా డెస్క్ ముందర కదలకుండా అదే పొజిషన్ లో గంటల తరబడి కుర్చీలో ఇరుకుగా ఇబ్బందిగా కూర్చోవటం పొట్టలో పాపాయికి చిరాకే సాయంత్రవేళ కూడా త్వరగా ఆహారం  తీసుకుని విశ్రమించటం చాలా మంచిది. రాత్రి పది తర్వాత ఎటువంటి పనైనా  అదీ కంప్యూటర్ ముందు కూర్చుని శ్రద్ధగా  చేయవలిసిన ఆఫీస్ పనియైన చేయద్దనే  హెచ్చరిక. ఆఫీస్ లో గంటల తరబడి కూర్చోవటం  పొట్ట పైన వత్తిడి పడుతుంది. గంటల తరబడి పని అదీ మళ్ళీ రాత్రిపూట చేసే పనివల్ల మానసిక వత్తిడి ఈ రెండిటి ప్రభావం కడుపులో పిల్లల ఎదుగుదల పైన ఉంటుంది. ఒత్తిడి కి గురైన తల్లులకు బరువు తక్కువ పిల్లలు పుడుతున్నారని వైద్యులు గ్రహించిన అంశం.

Leave a comment