ముంజేతులకు నల్లగా ట్యాన్ కనిపిస్తూ వుంటుంది దీన్ని పోగొట్టుకోవటం కోసం నిమ్మరసం, పెరుగు ఉపయోగించవచ్చు. పెరుగులో గంధం పొడి కలిపి అప్లయ్ చేస్తూ వుంటే ముంజేతులపై ఏర్పడ్డ నలుపు క్రమంగా పోతుంది. పుల్లని పదార్ధాల్లో ఆమ్లాలు వుండి సహజమైన పీల్ మాదిరిగా పని చేస్తాయి. యాసిడ్స్ కల కొన్ని ఉత్పత్తుల వల్ల కుడా మలుపు తగ్గచ్చు. హైడ్రోక్వినాస్ వంటి క్రీములు మాత్రం వైద్యులు పర్యవేక్షణ లో వాడాలి. ఏ విషయంలోనైనా వచ్చాక పోగొట్టుకోవడం కంటే రాకుండా జాగ్రత్త పడటం ఉత్తమం . ఎస్.పి.ఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువ సన్ స్క్రీన్ అప్లయ్ చేస్తే ట్యానింగ్ రాకుండా అడ్డుకోవచ్చు.

Leave a comment