అందాల పోటీల్లో  గెలిచాకనే సినిమాల్లో  నటించాలన్న స్పష్టమైన ఆలోచన వచ్చింది. ఎడ్వెంచర్ స్పోర్ట్స్ , ట్రెక్కింగ్ చేసే దాన్నీ కుదురుగా సినిమాల్లో కొచ్చేశాను అంటోంది మెహరీన్. ఫీలౌరీ బాలీవుడ్ మూవీ తర్వాత రాజా ది గ్రేట్ మహానుభావుడు, కేరాఫ్ సూర్య, జవాన్ తో తెలుగు సినిమాల్లో బిజీ అయిపోయింది మెహరీన్. చదువుకొనే రోజుల్లో టీచర్ అవ్వాలనుకొనే దాన్నీ, సునితా విలియమ్స్ ని దగ్గర నుంచి చూసి ఎరోనాటికాల్ ఇంజనీర్ అనుకొన్నా. హాస్పిటల్లో డాక్టర్ ను చూసి డాక్టర్ అవ్వాలనుకొన్నా, ఇక ఇప్పుడైతేనే చెపితే నవ్వుతారు గానీ టాలీవుడ్ లో ఫలానా కాలాన్నీ మెహరీన్ శకం అని చెప్పుకోనేలా గుర్తింపు తెచ్చుకోవాలనుకొంటున్నా అంటోది. అలాగే నాకు పారితోశకం కంటే కథే ముఖ్యం. మంచి కథాబలం ఉన్నా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకోవాలని నాకోరిక అంటోంది మెహరీన్.

Leave a comment