అందానికి ఆధారం ఆలివ్ నూనె అంటారు. గ్రీకు వనితలకు సౌందర్య రహస్యం ఆలివ్ లతో ఫేస్  మాస్క్ వేసుకోవడం అంటారు. చర్మం తేమగా తాజాగా కనిపించాలంటే ఆలివ్ నూనె ను మించింది లేదంటారు. ఈ నూనెలో ఉప్పు చెక్కర  కలిపి మొహంపై స్క్రాబ్  చేస్తే మృత కణాలు పోవడం తో పాటు చర్మం మెరిసిపోతుంది. గులాబీలు, చామంతులు,తామర పువ్వులు, ఆ మొక్కల వేర్లు కలిపి గుజ్జు చేసి వెనిగర్, ఆలివ్ నూనె తో కలిపి శరీరం పై రాసుకొని స్నానం చేయడం వల్ల చర్మం బిగుతుగా అయి, రక్త ప్రసరణ చక్కా జరిగి మెరిసిపోతుంది. చెక్కర  ఆలివ్ నూనె సీసాల్ట్ కలిపి స్క్రాబ్బింగ్ కోసం ఉపయోగిస్తారు.

Leave a comment