కడుపులో బిడ్డ కడుపులో ఉండగానే కొడుకు పేరు సోమలింగం అన్నట్లు
ఈ సామెత కు చక్కని అర్ధం ఉంది. ఊహలతో,కబుర్లతో కాలం గడిపే పనిలేని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళలో కష్టపడే తత్వం ఉండదు. ఊరికే కథలు అల్లటం తప్ప అలాటి వాళ్ళ గురించి బిడ్డ కడుపులో ఉండగానే పేరు పెట్టె వాడుగా వెక్కిరింత ఈ సామెత.
* కట్టె వంక పొయ్యి తీరుస్తుంది.
* ఓ కారము రానివాడు వడ్ల గుణించినట్లు.
* ఒక చేత్తో తట్టితే చప్పుడు అవుతుందా ?
* కలిగిన వారికి అందరు చుట్టాలే.
సేకరణ
సి.సుజాత