లాక్ డౌన్ మూలంగా ఇంట్లోనే ఉండే అవసరం వచ్చింది. చక్కని భాషా చిత్రాలు చూసే అవకాశం కూడా ఇదే. మరాఠి సినిమా ఎబి,ఆని సిడి ,ఒక సీనియర్ సిటిజన్ ఇంటా బయట ఎదురుక్కొనే ఛీత్కారాలు వృద్దుల విషయంలో చూపించే నిర్లక్ష్యలకు సంబంధించింది. చంద్రకాంత్ దేశ్ ముఖ్ (సిడి )ఒక రిటైర్ ఆర్ట్ టీచర్. ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఉన్న ఇంట్లో అతనొక పనికిరాని పాత వస్తువు లాంటివాడు.ఈయన స్థితి గమనించి మనవరాలు,మనవడు ఒక ప్లాన్ వేస్తారు. ఒక రోజు అమితాబ్ బచ్చన్ నుంచి ఒక కొరియర్ వస్తుంది. అందులో తనతో పాటు చదువుకొన్న బాల్య మిత్రుడు చంద్రకాంత్ ను ఒక స్కూల్ ఫంక్షన్ కోసం అమితాబ్ ఆహ్వానిస్తాడు. ఇక ఆ ఉత్తరం లో చంద్రకాంత్ ఎక్కడ లేని గౌరవ సత్కారాలు జరుగుతాయి. అమితాబ్ ను చంద్రకాంత్ పుట్టిన రోజుకి ఆహ్వానించ మని ఇంట్లో వాళ్ళు,ఫ్రెండ్స్ వత్తిడి చేస్తారు ఇక్కడ నుంచి కథ చాలా ట్విస్ట్ లతో ఇంటరెస్టింగ్ గా నడుస్తుంది తప్పకుండ ఈ సినిమా చుడండి.

Leave a comment