ఈసారి బడ్జెట్ లో మహిళల కోసం ఎన్నో ప్రత్యేక కేటాయింపులున్నాయి. మహిళా శిశు సంక్షేమ పధకాల కోసం 1.86 లక్షల కోట్లు కేటాయించారు. అదే గత సంవత్సరం 1. 56 లక్షల కోట్లు గర్భిణుల పాలిచ్చే తల్లులకు ఇందిరా గాంధీ మాతృత్వ సహయోగా యోజన పధకానికి 21000 కోట్లు కేటాయించారు. 14 లక్షల అంగన్వాడీ కేంద్రాలకు గ్రామాల్లో మహిళా శక్తీ ఆరేళ్ళ లోపు వయసుగల పిలల్లకు 15,245 కోట్లు కేటాయింపు జరిగింది. మహిళా శిశు సంక్షేమం కోసం 1,84,632 కోట్ల రూపాయలు కేటాయించారు. గ్రామీణ మహిళల స్కెల్ డెవెలప్మెంట్ ఎంప్లాయిమెంట్ డిజిటల్ విటరసీ  హెల్త్ అండ్ న్యూట్రిషన్స్ అలాగే దళిత మహిళలు గిరిజన మహిళలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల  కోసం ఈ కేటాయించిన డబ్బులోంచే సంక్షేమ పధకాలు చేపట్టాలి. పాలకులకు ప్రజా సంక్షేమం నిజంగా పట్టినట్లయితే ఏనాడో ప్రపంచంలో మహిళలంతా ఆర్థికాభివృద్ధిని చేతుల్లకి తీసుకుని వాళ్ళని వాళ్ళ కుటుంబాలను  సమర్ధవంతంగా నడిపించుకోగలిగేవాళ్ళు . గతం వదిలేస్తే ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు. ఒక కొత్త ఉషోదయం వస్తుంది. రేపటి రోజు బావుంటుందని ఆశిద్దాం .

Leave a comment