న్యూ సెంచరీ గ్లోబల్ సెంటర్ ప్రపంచంలోనే అతి పెద్దదైన కట్టడం. చైనాలో ఉన్న ఈ భవనం విస్తీర్ణం 420 ఎకరాలు ఒక చిన్న పట్టణం అంత అన్నమాట ఇందులో షాపింగ్ మాల్స్ బ్యూటీ పార్లర్లు, ఆటస్థలాలు అన్ని వుంటాయి. ప్రత్యేక ఆకర్షణ ఒక వాటర్ పార్క్ దీన్ని పారడైజ్ ఐలాండ్ వాటర్ పార్క్ అంటారు. ఇందులో 54 వేల చదరపు అడుగుల కుత్రిమ సముద్ర తీరంలో సూర్యోదయం, సూర్యాస్తమయం చుడచ్చు.ఈ భవనంలో కుత్రిమ సూర్యుని తయారుచేశారు ఉదయం ,సాయం కాలాల్లో ఒక పెద్ద స్క్రీన్ పైన పైన ఈ సూర్యుడిని చూడటం బీచ్ లో విహరించటం ఒక గొప్ప అనుభవం అంటారు. పైగా ఈ సూర్యుడి కారణంగా వెలుతురు,వేడి కూడా ప్రసారమై ఈ భవనాన్ని ఎంతో సహజంగా చూపెడతాయి.

Leave a comment