నా రాబోయే సినిమా ప్రాణ ఒక వినూత్నప్రయత్నం. ఒకే సారి నాలుగు భాషాల్లో తీశారు. డబ్బంగ్ లేకుండా డైలాగ్, చుట్టు పక్కల యాంబియన్స్ కుడా అన్నీ నేను నటిస్తోన్నప్పుడే షూట్ చేశారు. సరౌండ్ సింక్ పద్దతి. ఒక్క షాట్ ఒక్క భాషాలో నాలుగు సార్లు ఏనాడు లేకుండా షూట్ చేశారు. చాలా కష్టపడ్డాను అంటోంది నిత్యామీనన్ . నేనెప్పుడు నాకు పాత్ర నచ్చితేనే సినిమా చేస్తా. నా కెరీర్ మొదటి నుంచి ఇంత పేరున్న దర్శకులు ,పెద్ద హీరోలు అని అనుకోను ‘అలామొదలైంది’ సినిమా కంటే ముందే నాకు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ తో అవకాశాలున్నాయి. కానీ నా దృష్టిలో నటన అంటే కేవలం బ్యూటీ కాదు , మంచి కథ – మంచి పాత్ర. నాకు నచ్చితే ఎలాంటీ పాత్రలైన ,వయసు మళ్ళిన పాత్రలైనా ఇష్టంతో చేస్తానంటోంది నిత్యా మీనన్.

Leave a comment