అథ్లెటిక్స్ లో అండర్ 20 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన హిమా దాస్ అస్సాంలోని నాగోవ్ జిల్లా థింగ్ ఆమె స్వగ్రామం . వ్యవసాయ కుటుంబం తండ్రి తో పాటు పొలం పనులు చేసిన హిమా దాస్ రెండెళ్ళ క్రితం అథ్లెటిక్ గా మారి ఎన్నో మరపురాని విజయాలను నమోదు చేసింది. జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో ఇప్పటి వరకు 17 బంగారు పతకాలు సాధించింది.కాళ్ళకు చెప్పులైనా లేకుండా పోటీల్లో పరుగెత్తి ప్రాక్టీస్ చేసిన హిమా దాస్ ఆకలి పస్తులతోనే గడిపింది. గెలుపు సాధించాక ఆమెకు వచ్చిన ఫోన్ లతో ఆమె భోజనం చేసే సమయం కూడా చిక్క లేదట.

Leave a comment