Categories
Wahrevaa

బ్రేక్ ఫాస్ట్ బ్రెయిన్ ఫుడ్.

పిల్లలకు పూర్తి పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ పెడితేనే వారి దైనందన పోషక విలువల్లో చాలా భాగం వారికి అందినట్లు అవుతుంది. ఇది తోలి ఆహారం కనుక ఆ బ్రేక్ ఫాస్ట్ తో నే 25 శాతం క్యాలరీలు వారికి అందాలి. వివిధ ఫుడ్ గ్రూప్స్  నుంచి వారికి సమతుల్యాహారం నిండి వుండాలి. ఒక పండు పూర్తిగా వుండాలి. జ్యూస్ కూడా ఇవ్వడం మంచిదే. డాట్స్ అద్భుతమైన పోషకాహారం. వాటిని పాలతో ఉడికించి పండ్లు, తేనె కలిపి ఇవ్వాలి. గుడ్లు, చికెన్ , గోధుమ బ్రెడ్, తోటకూర , టోమాటోలతో కలిపి సాండ్విచ్ చేస్తే ఇంకానూ మంచిది. హోల్ వీట్, టోస్ట్, ఆరంజ్ జ్యూస్, వెజిటేబుల్స్ వేసిన ఆమ్లెట్, పెరుగు, పండు, సలాడ్స్, యాపిల్స్ పూర్తి ధన్యాలతో చేసిన ఇడ్లి, దోశ ఇవన్నీ బాలెన్సడ్గా ఇస్తూ వస్తే పిల్లలకు పూర్తి స్థాయి పోషకాలు అందినట్లు అవుతుంది. బ్రేక్ ఫాస్ట్ అద్భుతమైన ఆరోగ్య వంతమైన అలవాటు.

Leave a comment