ఇంట్లో వున్న, కాసేపు అలా ఆటల కోసం బయటకు వెళ్ళినా పిల్లలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఈ వేసవి ఎండలకు తప్పకుండా వుంటుంది. శారీరం డీహైడ్రేషన్ కు గురవ్వకుండా తాజా కొబ్బరి నీళ్ళు తాగించాలి. ఈ నీటి తో తక్షణ శక్తి లభిస్తుంది. పిల్లల్లో పొటాషియం మోపించ కుండా తాజా అంజీర పండ్లయినా మంచివే. అలాగే విటమిన్-సి వున్న పండ్లు తినిపించడం ముఖ్యం. ఉసిరికాయలు ఇంట్లో ఉంచాలి. తినటానికి పుల్లగా అంత రుచిగా లేక పోయినా ఈ వుసిరిలో వుండే ఔషద గుణాలు పిల్లలకు మేలు చేస్తాయి. తాజా పచ్చి జామకాయలు, కివి పండ్లు కూడా మంచివే. అలాగే జీర్ణ శక్తికి తడ్పడే ఎంజైమ్లు వృద్ది చేసే గుణం బొప్పాయి పండులో అధికం వేసవిలో వారానికి రెండు సార్లు పిల్లలు బొప్పాయి పండి తినేలా చూడండి. అలాగే ఏ సీజన్ లో అయినా సులభంగా జీర్ణం అయ్యే అరటి పండు కూడా పిల్లలకు ఇవ్వడం మంచిదే అధిక ఉష్ణోగ్రతతో శరీరం నిస్సత్తువకు లోను కాకుండా ఈ పండ్లు కాపాడతాయి.
Categories