Categories
Nemalika

ఎదుటివాళ్ళకు బోర్ కొడుతున్నామా?

నీహరికా,

మనం చాలా మందిని కలుస్తాం. బోలెడన్ని కబుర్లు చెప్పుకొంటాం. మనం మాట్లాడుతుంటే మనకు వుతసహంగానే వుంటుంది. మనం చెప్పే కబుర్లు ఎదుటివాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనే అనుకుంటాం కానీ నిజంగా ఎదుటి వాళ్ళకు మనం నచ్చుతుంటామా? ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇంకొందరిని మనం కలిసినప్పుడు వాళ్ళు తాము కలిసిన వ్యక్తిలు, చుసిన ప్రదేశాల గురించి వరస బెట్టి చెప్పేస్తుంటారు. కానీ వినే వాళ్ళకు, తమకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తుల గురించి, తాము ఎన్నడూ చూడని ప్రదేశాల గురించి వినే ఆసక్తి వుంటుందా? కొంతమంది తాము చేసిన ఫారిన్ విజిట్స్ గురించి మాట్లాడుతూ వుంటారు. అవి ఓర్పుగా వినగాలమా? మరికొందరు మనకు నచ్చాక పోయినా సరే ఎన్నో డాక్టర్ల సలహాలు, ఆరోగ్యం గురించి సలహాలు, మనం చేయాలనుకున్న ఉద్యోగం వ్యాపారం గురించి సలహాలు అలా ఇస్తూనే ఉంటారు. ఇవన్నీ మనకు నచ్చుతున్నాయా? మన స్నేహితులు కూడా మనకు సంబంధం లేని విషయాలు తెలిపితే  మనకి విసుగ్గా వుంటుంది. అందుకే ఇలాంటివాన్ని ఎనలైజ్ చేసుకుని అసలు పది మంది తో మన ప్రవర్తన, మన మాటలు ఎలా వుంటే అవతలి వాళ్ళకు బోర్ కొట్టకుండా వుంటుందో తేల్చుకుని మన ప్రయాణం కొనసాగించాలి. ఏమంటావు.

Leave a comment