స్త్రీ పురుషుల శారీరక సగటు బరువుల ప్రమాణాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఐదు కిలోలు పెంచింది.దానితో పురుషులు బరువు 60 నుంచి 65 కిలోలకు,మహిళల బరువు 5.నుంచి 55 కిలోలకు పెరిగినట్లు అయింది.కాలానుగుణంగా శరీరం తీరు ఆహార శైలి కొలతలు మారుతూ ఉంటాయి కాబట్టి ఒకే ప్రమాణాలను అనుసరించరాదనే ఉద్దేశంతో ఈ సవరణ జరిగింది.19 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న మహిళ సగటు ఆహార శైలిలో ప్రధానమైన మార్పులు చోటు చేసుకుంటాయి.కాబట్టే వారి ఆహార అవసరాల లో కూడా మార్పులు జరిగాయి.పూర్వపు ప్రమాణాలను బట్టి బరువు తగ్గేందుకు మహిళలు ఆహారం తగ్గించి తింటున్నారు దీనివల్ల పోషకాహార లోపాలు ఏర్పడేవి అందుకే ఆరోగ్య సంస్థ సగటు బరువు ఐదు కిలోలకు పెంచింది.

Leave a comment