తెలిసినా పట్టించుకోని తెలుసుకుని తీరవలసిన చిన్న చిన్న విషయాల వల్ల  పెద్ద చర్యలు చేపట్టే వీలుంటుంది. బాగా అలసిపోతే శరీరం శక్తీ సన్నగిల్లి పోతే ఓ కప్పు ఎనర్జీ డ్రింక్ తాగాలని అనుకుంటారు కానీ ఒక్క అరటిపండు చక్కని వర్కవుట్ ఇంధనం ,ఎనర్జీ డ్రింక్ తాగినా పదిహేను నిమిషాలోకసారి మంచి నీళ్లు తాగినా అదే ఫలితం. గ్లూకోజ్ స్థాయిలు అంటే ఎనర్జీ స్టోర్స్ రెండింటికీ ఒకే మాదిరి ఉంటాయి . ఒక్క అరటిపండులా కార్బోహైడ్రేట్స్  పొటాషియం విటమిన్లు యాంటీ  ఆక్సిడెంట్లు కలగలిసి ఉంటాయి. ఇందులోనే సహజ శక్తీ ఉంటుంది . అలాగే గాసిప్ లు మాట్లాడుకోవటం పాపం అనుకుంటాం. ఈ  మాటలకూ ప్రాణాల్ని కాపాడే శక్తీ వుంటుందంటున్నారు  ఎక్స్ పెర్ట్స్ . ఎవ్వరితోను సంబంధం  లేని జాబ్స్ చేసే వాళ్ళు 2.4 రేట్లు ముందుగా చనిపోతారట. వాళ్లకు ఎవ్వళ్లతో కబుర్లకి మనసు విప్పి మాట్లాడు కొనేందుకు అవకాశం లేదు అదే సహారోగ్యాలు ఓ పదిమంది వుంది వాళ్ళతో గాసిప్ లు మాట్లాడుతూ  రిలాక్స్ పొందుతూ ఉంటే ఒత్తిడి తగ్గించే హార్మోన్లు విడుదల అవుతుంటాయట. వీళ్ళలో  జబ్బుల రిస్క్ తక్కువ. కానీ ఒక ముఖ్య విషయం గాసిప్ లు ఏ రిస్క్ నయినా తగ్గించవచ్చు కానీ మనం మాత్రం ఎదుటి వాళ్ళకి హాని చేయని నొప్పించని గాసిప్ లే ఎంజాయ్ చేయాలి. లేకపోతే నిజంగానే పాపం.

Leave a comment