కరోనా వైరస్ కారణంగా స్వీయ నిర్బంధం లో ఉన్నా సమయంలో సమతుల్య ఆహారం తీసుకోమని చక్కని భోజన నియమాలు పాటించమని చెపుతున్నారు వైద్యులు .సమతుల్య ఆహారం అంటే విటమిన్ ఎ బి సి డి , ఐరెన్ , సెలీనియం , జింక్ ఉండే ఆహారం సమపాళ్ళలో తీసుకోవాలి .ఇందు లో ఉండే సూక్ష్మ పోషకాలు వైరల్ బాక్టీరియా ఇన్ పెక్షన్ లతో పోరాడతాయి .గుడ్డు , బాదం , పిస్తా , తృణ ధాన్యాలు , ఆకుకూరలు క్యారెట్ , చికెన్ , చేపలు , శెనగ బొబ్బట్లు నిమ్మ  నారింజ , చెర్రీ  , కివి , టమోటాలు పిస్తా ఆక్రూట్ వెజిటల్ ఆయిల్ , నీళ్ళు మజ్జిగ మొదలైనవి ఆహారంలో భాగం గా ఉంటే చక్కని రోగ నిరోధక శక్తి తో వైరస్ ను ఎదుర్కొంటుంది శరీరం .మంచి భోజనానికి తోడు ఓ గంట నడక , వ్యాయామం చక్కని నిద్ర మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి .ఒత్తిడి తగ్గిస్తాయి కూడా .

Leave a comment