కేరళలోని త్రిచూర్ లో రెండు కోట్ల ఖర్చులో రెండస్థులతో మహిళల కోసం షీ లాడ్జ్ ఏర్పాటైంది. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల కోసం అలాగే వితంతువులు ,అవివాహితులు ఎందరో ఈ లాడ్జ్ భద్రత ఇస్తుంది. గదుల విషయంలో భోజన ఏర్పాట్లు అన్ని అందుబాటులో ఉంటాయి. వాటిని పూర్తిగా స్త్రీలే నిర్వహిస్తారు.సిసి కెమెరాలు సెక్యురిటీ ఉంటాయి. రైల్వే స్టేషన్ బస్టాండ్ లకు డ్రాపింగ్ ఉంటుంది. ఒకేసారి 40 మంది బస చేయటానికి వీలుగా ఉంటుంది. కేరళలోని 14 జిల్లాలో ఈ షీ లాడ్జ్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. వీటి నిర్వహణ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లకు అప్పగిస్తారు.