రొట్టెలు వేడి వేడిగా తింటేనే బావుంటయాని ఇప్పటి వరకు అనుకొంటు ఉన్నాం. అవి వేడిగా తినేకంటే ,చేసి రెండు రోజులు అలా ఉంచి అప్పుడు చద్ది రోట్టెలు తింటే మధుమోహాం ఉన్న వాళ్ళకి చాలా మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. రొట్టె తయారు చేసిన రెండు రోజుల తర్వాత అందులో ఆరోగ్యానికి మేలు చేసే బాక్టీరియా ఏర్పడుతోంది. దానితో పాటు అందులోని గ్లూకోజ్ శాతం తగ్గుతోంది. అప్పుడు ఆ రొట్టెను అలా నేరుగా కానీ పాలతో కలిపి కానీ తీసుకొంటే ఉదర సంబందమైన వ్యాధుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది అంటున్నారు .శరీర ఉష్టోగ్రతను ఇవి సమతుల్యం చేస్తాయి. ఇక రొట్టెలు చేసి రెండు రోజులు నిలవుంచి తినండి అందరికా ఆరోగ్యమే అంటున్నారు.

Leave a comment