తెలిసో తెలియకనో తాత్కాలికంగా ఒక ఆరోగ్య సమస్య నుంచి బయట పడి ఇంట్లో పనులు, బయట పనులు ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసుకోవాలనో ఒక నిర్ణయమో, ఆడవాళ్ళని ప్రమాదాల బారిన పడేస్తుంది. ఎన్నో  అనారొగ్యాలకు దగ్గర చేస్తుంది. తాజా వచ్చిన ఒక అద్యాయినం రిపోర్టులు స్త్రీలు ఏమాత్రం నీరసం అనిపించినా ఐరన్ మాత్రలు, ఇతర బలానికి సంబందించిన మాత్రలు వేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఐరన్ నిల్వలు పెరిగి ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి ఎక్కువై ఇన్సులిన్ ను దెబ్బ తెస్తాయని ఫలితంగా టైప్-టు డయాబెటిస్ వచ్చే అవకాశం వుందని అద్యాయిన కారులు చెప్పుతున్నారు. అందుకే స్త్రీలు కష్ట నీరసం అనిపిస్తే మంచి ఆహారంతో ఆరోగ్యం, ఓపిక పొందాలని, ఐరన్ టాబ్లెట్స్ జోలికి వెళ్ళద్దని, పరిశోధకులు  చెప్పుతున్నారు. పురుషుల తో పోల్చుకోంటే స్త్రీలే డయాబెటిస్ బారిన ఎక్కువగా పడుతున్నారని రిపోర్టు చెప్పుతుంది.

Leave a comment