Categories
Soyagam

ఇది స్వచ్చమైన మాయిశ్చరైజర్

సాధరణంగా ఏ సీజనయినా మాయిశ్చరైజర్లు తప్పనిసరి. అయితే ఇందుకోసం ఖరీదైన క్రీములు, లోషన్లే అవసరం లేదు. కొబ్బరినూనె, ఆప్రికోట్ ఆయిల్స్ సైతం అత్యంత ప్రభావంతంగా పనిచేస్తాయి. షియా బటర్ క్రీంలో పర్ఫ్యుమ్స్, ఇతర రసాయనాలు ఉంటాయి. కొబ్బరినూనె అటువంటి వాటికి అవకాశమివ్వని స్వచ్చమైన మాయిశ్చరైజర్. చర్మం పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరినూనె అప్లయ్ చేయొచ్చు. దీనివల్ల చర్మం సరైన తేమతో నిగారిస్తుంది. అలాగే నువ్వుల నూనె, కొబ్బరి నూనె కలిపి కళ్ళ కింది ముడతలపైమర్దన చేస్తే కూడా చక్కని ఫలితం వుంటుంది. ఆముదం, కొబ్బరి నూనెలు కూడా మంచి మాయిశ్చరైజర్సే. నిద్రించే ముందు ముఖానికి రాసి పడుకొంటే ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి. చర్మానికి తేమ అందించి సున్నితంగా చేసే అత్యుత్తమ నూనెల్లో కొబ్బరి నూనె ఒకటి. ఎలాంటి ప్రతికూల, ప్రతి చర్యలు చేయకుండా సురక్షితంగా పని చేస్తుంది. పొడి చర్మం ఉన్న వాళ్ళు పచ్చి కొబ్బరి తినడం వల్ల శరీరానికి తేమ అందుతుంది. కొబ్బరి పాలు చర్మానికి పట్టిస్తే మృత కణాలు, మురికీ పోతాయి.

Leave a comment