సాధారణంగా చాలా ఎర్లీగా తినవలిసినవన్నీ తినేసి ఇంక తిండికి ఫుల్ స్టాప్ పెట్టేయమంటారు నిపుణులు. కానీ చెప్పటం వరకూ బాగానే వుంటుంది. ఎనిమిదింటికే తినేస్తే ఏ పది గంటలు దాటుతుంటేనే ఆకలేస్తే ఎలాగా? చేయి ఆహరం వైపు వద్దన్నా వెళుతుంది లేదా ఆకలి అర్ధరాత్రి వేళ నిద్ర నుంచి మేల్కొలుపుతుంది. ఇలా రాత్రి వేళ ఆకలేస్తే తినే ఆహారం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలంటారు నిపుణులు. దీనికి హోల్ గ్రయిన్ పాప్ కార్న్ సరైన ప్రత్యామ్నాయం. అంతే కాదు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కు మంచి ఆధారమే కాకుండా తక్కువ క్యాలరీలు కలిగి వుంటుంది. పాలను పడుకొనే ముందు తాగే పానీయంగా ఎప్పటినుంచో పరిగణిస్తున్నారు. పాలలో ఉండే ట్రిటో సన్స్ శరీరం సెరటోనిన్ ఉత్పత్తి చేయడానికి సహకరిస్తుంది. ఈ రసాయనం శరీరాన్ని కామ్ గా ఉంచి చక్కని నిద్ర పట్టడంలో సాయం చేస్తుంది. ఓట్స్ లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వుండి, చాలాసేపు కడుపు నిండినట్లుగా వుండేలా చేస్తాయి. సెకండ్ డిన్నర్ గా వేయించిన స్నాక్స్ కంటే భాక్రా లేదా రోటీ, గ్రీన్ వెజిటబుల్స్ కూడా తినడం ఎంతో మంచిదని సిఫార్స్ చేస్తున్నారు ఆహార నిపుణులు.

Leave a comment