మామిడి కాయలోస్తున్నాయ్. ఎన్నో వెరైటీస్ వండుకుంటాం. పచ్చడి, పప్పు, పులిహోర, ఇలా ఎన్నెన్నో స్పెషల్స్. ఇంత తరచుగా వండే మామిడికాయలో ఎన్నెన్నో పోశాకలుంటాయి. మామిడి కాయ ముక్కాలా పై కాస్త ఉప్పు చల్లుకుని తింటే శరీరంలో నీటి శాతం పోగొట్టుకోకుండా వుంటుంది. డిహైడ్రేషన్ ప్రాబ్లం వుండదు. వేటిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని కణాలు పునరుద్దరించడంలో ఇందులోని పోషకాలు ఉపయోగ పడతాయి. రక్త హీనత అదుపులో వుంటుంది. వడదెబ్బ తగిలితే పచ్చి మామిడిరసాన్ని మరిగించితీసుకుంటే ఫలితం వుంటుంది. నీరసం అలసట ను తగ్గించుకోవడంలో మామిడినిమించిన పండు ఇంకోటి లేదు. గర్బిణి స్త్రి లు మామిడి కాయ వాసన చూసినా, తిన్నా, ఉదయం వేళ భాదించే వికారం తగ్గుతుంది. వంతులు తగ్గుతాయి. పచ్చి మామిడిలో విటమిన్-సి యంటి ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి. ఇవి పండ్ల కన్నా పచ్చి దాని లో ఎక్కువ మామిడి ముక్కలకు అజీర్తి, మలబద్దకం పోగొట్టే శక్తి వుంది. ఈ సీజనల్ ఫ్రూట్ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.

Leave a comment