శరీరంలో నీటి శాతం తగ్గితే అలసట వళ్ళు నొప్పులు వస్తాయి దీర్ఘ కాలంలో మరిన్ని అనారోగ్యాలు వస్తాయి. డీహైడ్రేషన్ తగ్గించే ఆహార పదార్ధాలని తీసుకుంటే ఎలాంటి సమస్య రాకుండా ఉంటాయి. నీటిశాతం ఎక్కువగా ఉండే కీరా దోస శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. విటమిన్- సి నీటి శాతం అధికంగా ఉన్న ముల్లంగిని కూర లో భాగంగా చేసుకుని తింటే వేడి తగ్గిపోతుంది. అలాగే సొర, బీర వంటివి కూడా శరీరంలో నీటి నిలువలు కోల్పోకుండా చేస్తాయి వీటిల్లోని పీచు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. ముఖ్యంగా బీరకాయలోని విటమిన్-సి జింక్,థయామిన్ వంటి పోషకాలు డీహైడ్రేషన్ రాకుండా కాపాడతాయి.

Leave a comment