కాశ్మీర్ ఫైల్స్ 90 నాటి కాశ్మీర్ పరిస్థితుల పై తీసిన చిత్రం ఈ సినిమా తీసేందుకే నెలరోజులు సరిపోయింది. కానీ ఆనాటి పరిస్థితుల పరిశోధనకు నాలుగేళ్లు పట్టింది. వందల మందిని ఇంటర్వ్యూలు చేశాం. కాశ్మీర్ పండితుల కన్నీటి కథలు తెలుసుకున్నాం. నా కెరీర్ లో ఇది ప్రత్యేకం ఎన్నో పాత్రల్లో నటించాను కానీ ఇందులో జెఎన్.యు ప్రొఫెసర్ రాధిక మీనన్ ఈ పాత్ర నాకు చాలా స్పెషల్ అంటుంది  పల్లవి జోషి. 80,90 ల్లో దూరదర్శన్ లో రేణుక సహాని తో కలిసి అంత్యాక్షరి నిర్వహించిన పల్లవి కి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బుద్ధ ఇన్ ది ట్రాఫిక్ జామ్,ది తాష్కెంట్ ఫైల్స్ లో నటించి జాతీయ పురస్కారాలు పొందారు. ఈ కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రధాని మోడీ తో సహా దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందజేశారు.

Leave a comment