మడ అడవుల్లో సన్నగా పొడవుగా పెరిగే హెర్బల్ ఐవరీ ప్లాంట్ లోపల భాగం ఖాళీగా ఉండి అది బెండు లాగా ఉంటుంది. దీన్ని ఇండియన్ కార్న్ అని కూడా పిలుస్తారు. బెంగాల్ లో ఈ మొక్క బెండు తో దేవతా విగ్రహాలని అలంకరించే మలలు వధూవరులు పెళ్లి లో పెట్టుకునే కిరీటాలు అలాగే ఎన్నో కళా రూపాల్ని తయారు చేస్తారు. బెంగాల్, అస్సాం, ఒరిస్సా ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కలు ఇప్పుడు తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ పెంచుతున్నారు. స్వచ్ఛమైన తెలుపు లో మెరిసే ఈ బెండు తో అందమైన పూల దండలు దేవత రూపాలు తయారు చేస్తున్నారు. ఈ అద్భుతమైన మొక్కని షోలా పిత్ అని కూడా అంటారు.

Leave a comment