బీహార్ రాష్ట్రంలోని పట్నాలో గయ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫల్గుణి నది తీరానికి దగ్గర మంగళగిరి కొండ పైన మంగళగౌరీ దేవి వెలసింది.
అష్టాదశ శక్తిపీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటి. పార్వతీదేవి వక్షస్థలం ఈ ప్రాంతంలో పడింది అని పురాణ గాథలు.అమ్మవారు సంహారిణీ రూపంలో ప్రత్యక్షమవుతుంది.నంది, ఎదురుగా లింగాకారంలో ఉన్న పరమశివుడు దర్శనం ఇస్తారు.ఇక్కడ మహిషాసుర మర్దిని,అహల్య దేవి ఆలయాలు కూడా చూడవచ్చు.భక్తులు చైత్ర,వైశాఖ,శ్రావణ మాసాలలో అత్యంత ప్రీతి కరమైన మాసం అని భక్తిగా పూజలు చేసి ముక్తి పొందడానికి యోగ్యత సాధిస్తారు.

నిత్య ప్రసాదం:కొబ్బరి,పాయసం

            -తోలేటి వెంకట శిరీష

Leave a comment