హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రశంసలు అందుకొంది నితికా కౌతా ధీండియాల్. ఆమె భర్త మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జైష్ ఇ మొహమ్మద్ ఉగ్రవాదులతో జరిగిన కాల్పులలో ప్రాణాలు కోల్పోయారు. భర్త చనిపోయి ఏడాది అయింది. ఆమె భర్త ఆశయాలు దృష్టిలో పెట్టుకొని కరోనా కష్ట కాలంలో పోలీస్ సిబ్బంది కోసం మాస్క్ లు పిపీ ఈలు గ్లౌజులు లాంటివి వెయ్యికి పైగా భద్రత కిట్లు కొని హర్యాణా పోలీసులకు అంద జేసింది. విరాళాలు సేకరించి పోలీస్ సిబ్బంది కోసం ఎన్నో సమకూరుస్తోంది. పోలీస్ లు కనిపించాని శత్రువుల కోసం ఎంతో యుద్ధం చేస్తున్నారు వాళ్ళకు అండగా నిలిచేందుకే ఈ చిన్న ప్రయత్నం అంటోంది నితికా.