జీరారైస్ చాలా రుచిగా ఉంటుంది. తాలింపులో ఆవాలతో పాటు జీలకర్ర కూడా వాడతాం. కమ్మని చారు సువాసనకి జీలకర్ర పాత్ర ఎంతో కొంత ఉంటుంది. ఈ జీలకర్రలో ఉండే యాంటీబాక్టీరియల్ ,యాంటీఇన్ ఫ్లమేటరీ గుణాలు జులుబు ,దగ్గును నివారిస్తుంది. ఇందులోని ఇతర పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ పెక్షన్ లతో పోరాడేలా చేస్తాయి.వీటిలో పీచుల ఎక్కువే. ఇది జీర్ణవ్యవస్థ సక్రమంగా జరగటానికి అవసరం అయ్యే ఎంజైముల ఉత్పత్తికి సహాయపడుతాయి. జీర్ణ సంబంధ వ్యాధులను నయం చేసేందుకు తోడ్పడుతోంది. గర్భిణులు దీన్ని తీసుకోవటం వల్ల తిన్న ఆహారం సులువుగా అరిగి మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది. గర్భిణుల్లో అనిపించే ఉదయపు వికారాలను ఈ జీలకర్ర నివారిస్తుంది.

Leave a comment