ఇప్పటికే మీటూ ఉద్యమానికి ఎంతో మంది సౌత్ కథానాయికలు మద్దతు తెలిపారు. తాజాగా కన్నడ నటి శృతి హరిహరన్ కన్నడ,తమిళ ద్విభాషా చిత్రం సెట్ లో నటుడు అర్జున్ తనను లైంగికంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. చిన్నప్పటి నుంచి అర్జున్ సినిమాలు చూస్తూ పెరిగాను.కానీ ఆయిన కారణంగానే నాకు ఇలాంటి అనుభవం ఎదురవుతుందని అనుకోలేదు. 2016 ఓ సినిమా సెట్ లో ఓ రోమాంటిక్ సీన్ రిహార్సల్స్ లో భాగంగా ఆయన నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నన్ను గట్టిగా హత్తుకొని అభ్యంతరకరంగా నన్ను తడిమారు. ఇప్పుడు మీటూ పవర్ ఫుల్ గా తయారవుతుంది కనుక నేను ధైర్యంగా ఈ అనుభవాన్ని బయటకు చెప్పుకోగలిగాను అంటోంది శృతి హరిహరన్.

Leave a comment