ఫేస్ ఫ్యాక్ ల కంటే ఆయిల్ థెరఫీతో చర్మం ఆరోగ్యంగా ఉంటుదంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రతి రోజు పడుకొనే ముందర ముఖానికి బాధం నూనె కానీ ఆలీవ్ ఆయిల్ కానీ రాయాలి. పాదాలు, అరచేతులు, మోచేతులు చర్మం పొడిబారి గట్టిపడిన ప్రదేశంలో కూడా ఆయిల్ రాయలి. ఈ ఆయిల్ రాసే ముందర చర్మం దుమ్ము ,ధూళిలేకుండా శుభ్రం చేసుకోవాలి. ఉదయం వేళ గోరువెచ్చని నీళ్ళలో ముఖం అందులో మునిగేలా ఉంచుతూ ఇలా నాలుగైదు సార్లు చేస్తే ఆ వేడి నీటికి చర్మంలోని నూనె గ్రంథులు ఉత్తేజితం అవుతాయి. చర్మాన్ని మృదువుగా చేయటంలో గ్రీప్ సీడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది.దీన్ని నేరుగా ఒంటికి మొహానికి రాసి మర్ధన చేయాలి. ఏ నూనె అందుబాటులో లేకపోయినా ఆముదం కానీ అవకాడో ఆయిల్ అయినా సరే చర్మానికి మేలు చేసేవే.

Leave a comment