ఆలియా భట్ కు ఈ ఏడాది కపూర్ అండ్ సన్స్ తో సుభారంభం ఇచ్చింది. డియర్ జిందగీ మంచి వసూళ్ళు అందుకుంది. ఇక ఉడ్తా పంజాబీ విడుదలకు ముందే సంచలనం.జాతీయస్థాయి లో పెద్ద చర్చ నడిచింది ఈ చిత్రం తో ఇప్పటి వరకు ఆలియాకున్న ఇమేజ్ వేరు. ఈ ఏడాది ఈ పాత్ర తో వచ్చిన ఇమేజ్ వేరు. అందమైన అమ్మాయి గా నే కాదు. పరిమితి చెందిన నటిగా కూడా పేరు తెచ్చుకుంది. రాబోయే సంవత్సరంలోకూడా ఆమె డైరీ నిండుగానే వుంది. చేసే పాత్రలో ఇమిడిపోయే ఆలియా తన నటన తో అన్ని కోణాలు బయటకు తీస్తుంది. కపూర్ అండ్ సన్స్ లో ఆలియా హాస్య కోణం భయట పెట్టింది. ఉడ్తా పంజాబీ లో బీహార్ నుంచి వచ్చిన యువతి గా ఆలియా నటించింది. ఈ సినిమా కోసం ఆలియా బీహార్, పంజాబీ కలగలిసిన యాసలో మాట్లాడే శిక్షణ తీసుకుంది. పూర్తి డి-గ్లామర్ పాత్రలో నటించి మెప్పించిన ఆలియా భట్ ఉత్తమ నాయికగా రేస్ లో ముందుంది.

Leave a comment