ఇంటి వాకిట్లో కళ్ళాపుజల్లి ముగ్గులు వేస్తె ఆ ఇంటి ముందర మహాలక్ష్మి కొలువు దీరుతుందని పూర్వం నమ్మకం. ఇప్పుడా విశాలమైన వాకిళ్ళు లేవు. ముగ్గుపిండి తో ముగ్గులు లేవు. అపార్ట్ మెంట్ ఇళ్ళ ముందు ముగ్గుల స్టిక్కర్స్  వచ్చాయి.  వాకిటి ముందు ముగ్గుల స్తిక్కర్స్ వచ్చాయి. వాకిటి ముందు అతికించిన ఇంట్లో హాల్లో అతికించి దీని పైన పూవులతో నిండిన పాత్రలు పెట్టిన ఇంటికి హాలుకి కొత్త అందం వచ్చినట్లే మామిడి పిందెలు, సింపుల్ సర్కిల్స్, ఎర్రని, తెల్లని, పచ్చని, గులాబీ రంగుల్లో చక్కని ముగ్గులు, అతిధులకు ఆహ్వానం పలుకుతున్నాయి. నెట్ లో బోలెడన్ని రంగోలి ఇమేజస్ వరసలు తీరి వున్నాయి. ఓ సారి చుస్తే బావుంటుంది.

Leave a comment