నీహారికా,

పిల్లల్ని తీర్చి దిద్దాలనీ, ప్రపంచం వాళ్ళని విస్తుపోయి చూడాలని ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. ఈ కోరికతో పిల్లలపై ఎంతో భారాన్ని మోపుతున్నారు. వాల్లపైన పెట్టె హద్దులు ప్రతి ఇంట్లోను కనపడుతూనే ఉంటాయి. వాళ్ళు టీవీ చూడకూడదు, నిమిషం వృధా చేయకూడదు, నూరు మార్కులకు ఒక్కటి కూడా తగ్గకూడదు. నిమిష నిముషం పక్కింటి పిల్లలతో పోలిక తీసుకు వస్తూ వాళ్ళపైన మితిమీరిన ఆంక్షలు పెడుతూ ఉండటం చూస్తున్నాం. దీనివల్ల లాభం కంటే, వాళ్ళ మంచి పేరుల కంటే అనారోగ్యం తెచుకోవడం ఖాయం. కానీ ఇంత హింస వాళ్లు కొద్దికాలం భరిస్తారు. వాళ్ళు మొండిగా తయారైతే ప్రతి మాటకి అడ్డం తిరిగితే ఏమవుతుంది. అంచేత వాళ్ళతో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్ళు చేసిన మంచి పనులు  ప్రోత్సహించాలి . తప్పు చేస్తే దండించాలి. వాళ్ళ ప్రతి చర్య వెనుక ప్రేమగా మేమున్నామని, వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామని పిల్లలు తెలుసుకొనేలా మాట్లాడాలి. అంత్యంత కట్టుబాట్లు సడలించాలి. వాళ్ళు స్వేచ్చగా ఉండేలా చుసుకూవాలి. వాళ్ళ ఐక్యూ శాతం ఎంతో చూసుకొని, ప్రతివాళ్ళు చదువుతోనే రానించాలనే ఉద్దేశం మార్చుకోవాలి. పిల్లలలో ఏదో ఒక కళ దాగి ఉంటుంది. దాన్ని వెలికి తీసి వాళ్ళు వృద్ధిలో పైకి వచ్చేలాగా తల్లిదండ్రులు కేవలం మార్గ దర్శకులుగా ఉండాలి. అంతే.

Leave a comment