తియ్య తియ్యని ఆహార పదార్ధాలు భోంచేసినట్లు ఏదైనా అనారోగ్యం వస్తే ఓ చిన్ని టాబ్లెట్ వేసుకునేందుకు చాలా ఇబ్బంది పడతారు కొందరు. ఏదైనా అరటి పండులో పెట్టేసి పిల్లల చేత మాత్రలు మింగించేస్తారు. చెడు తగలకుండా ఏ పంచదారో చేత్తో పట్టుకుని  టాబ్లెట్ మింగిస్తారు. ఇవేవీ సరికాదు, టాబ్లెట్ ని నీళ్ళతో మాత్రమే వేసుకోండి అంటున్నారు డాక్టర్లు. కాఫీ, టీలతో వేసుకుంటే కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు. ఉదాహరణకు అస్తమా వంటి అనారోగ్యాలకు వాడే టాబ్లెట్ల గుణాన్ని కాఫీ లోని కెఫెన్ తిస్తుందంటున్నారు. పాలల్లోని కాల్షియం, యాంటీ బయోటిక్స్ ని పూర్తి స్ధాయిలో పని చేయనీయకుండా  అడ్డుపడుతుందిట. పళ్ళరసాలు, కూరగాయల రసాలు వీటి తో వేసుకున్న కొన్ని రకాల మందులు పని చేయవనే చెప్పుతున్నారు. నీళ్ళతో వేసుకుంటేనే మందులు పనిచేస్తాయని తేలుతుంది.

Leave a comment