బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్న ఇలియానా ఈ మద్య తాను ఆకతాయిల వేదింపులకు గురయ్యానని సోషల్ మీడియాలో ఫైరయిపోయింది. ఈ మద్య లక్నోప్యాషన్ వీక్ పాల్గొని ఇంటికి బయలు దేరాను. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది. అప్పుడు ఆరుగురు యువకులు కారులో ఉన్న నన్ను గుర్తించి ఎంతో అసభ్యంగా ప్రవర్తించారు. అద్దాలు కొట్టారు. ఒకడు ఏకంగా బానేట్ ఎక్కి కూర్చున్నాడు. ఎంతో షాక్ అయ్యాను. ఎలా తప్పించుకోవటమో తప్ప నాకు వేరే ఆలోచన రాలేదు. గీన్ సిగ్నల్ పడి నా కారు బయలుదేరాక కూడా వాళ్ళు ఫాలో అయ్యారు. ఫోటోలు తీసి పోలీసులకు పంపాలనిపించినా తర్వాత ప్రాబ్లం ఏమో అని వదిలేశాను. నా వృత్తికి మరి నేను సేఫ్ గా ఇంట్లో కూర్చునే పని కాదు కదా. బాడీగార్డ్ ని పెట్టుకుందామని ఆక్షణంలో అనుకున్నా.ఇలా అయితే ఎలా మనం వంటరిగా నడవటం కూడా ఈ నాటికి కష్టమైపోతుంది అంటూ ఎంతో బాధపడింది ఇలియానా. ఈ అనుభవంతో జాగ్రతగా ఉండండి. బయటకువస్తే అవసరైమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి అని మహిళలకు చెప్తున్నా అంటుంది ఇలియానా.
Categories