భోజనాన్ని ఉదయం చక్ర వర్తి స్ధాయిలో, మధ్యాహ్నం మహారాజు లెవెల్లో, ఇక సాయంత్రం నిరుపేద మాదిరిగా చేస్తే అరోగం అని పూర్వికులు చెప్పేవాళ్ళు. ఇదసలు మంచిదే కాదని కొట్టి పారేస్తున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఉదయం పూట తీసుకునే ఆహారం సరే విందు భోజనం లాగాను , మధ్యాహ్నం భోజనం మితంగాను ఇక రాత్రి తిన్నాను అంటే తిన్నాను అనిపించుకొండి అదే ఆరోగ్యం అంటున్నారు. ఎందుకంటే జీర్ణ క్రియతో పాటు పిండి పదార్ధాలను నిల్వ చేయడం లో కీలక పాత్ర వహించే ఇన్సులిన్ హార్మోన్ పని తీరు ఉదయం వేళ లో క్రియాశీలంగా ఉంటుందిట. అందువల్ల ఉదయం వేల తినే భోజనంలో పొషకాలన్నీ శక్తిగా మారి శరీర భాగాలు సవ్యంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. అదే రాత్రి వేళలో భోజనం చేసాక ఓ గంట అటు ఇటుగా వెంటనే నిద్ర పోతాం. ఆ సమయుంలో క్లోమా సమస్యలు వస్తాయి. అమ్చ్చేట సరైన వేళలు పాటిస్తే బెటర్ కదా!

Leave a comment