ఉపాధి కోసం దేశ రాజధాని ఢిల్లీకి వేలాది మంది వలస వస్తూ ఉంటారు .వాళ్ళు కూలీలు , కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు .వారి పిల్లలు మాత్రం వీధుల్లో ముష్టి ఎత్తి బతుకు సాగిస్తుంటారు .ఈ పిల్లల ఆరోగ్యం , చదువు కోసం సునాయ్ ఫౌండేషన్ స్థాపించిచారు రిచా ప్రశాంత్ .ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వసంత కుంజ్ దగ్గర ఓ పాఠశాల ఏర్పాటు చేసి కూలీలు , కార్మికుల పిల్లలకు చదువు చెపుతున్నారు .కోల్ కొత్త బీహార్ లోని వైశాలి ప్రాంతంలో ఇలాటి పిల్లలకోసం పాఠశాలలు ఏర్పాటు చేశారు .ఇప్పటి వరకు కొన్ని వేలమంది పిల్లల చదువు కొని ఉన్నత విద్యకు వెళ్ళారు .దాతల సహకారంతో వారికీ మధ్యాహ్నం వేళల్లో పాఠశాలల్లో నే భోజనం అందిస్తోంది రిచా ప్రశాంత్ .

Leave a comment