జానపద కళారూపాలను కూడా తమ డిజైన్ లోకి తెస్తున్నారు ఫ్యాషనిస్ట్ లు టిబెటన్ ప్రాచీన బౌద్ధ కళ తంగ్కా డిజైన్ లను శీతాకాలపు ఫ్యాషన్ లుగా తీసుకొచ్చారు ఫ్యాషన్ డిజైనర్లు. కాంతివంతమైన రంగులతో దారపు పోగులతో పల్లె అల్లికలతో శీతాకాలపు దుస్తులుగా అనార్కలీ, లాంగ్ కుర్తాలు మరింత అందాలు తెచ్చుకున్నాయి. బౌద్ధ కళ తంగ్కా ను నింపుకున్న ఈ డిజైనర్ అనార్కలీ డ్రెస్ లు ఎంబ్రాయిడరీ, కచ్ వర్క్, గొటా, పట్టి టాజిల్స్ వంటి హంగులతో ఇప్పుడు అమ్మాయిలను ఆకట్టుకుంటున్నాయి సాంప్రదాయ ఎంబ్రాయిడరీ వర్క్ మోటిఫ్ లతో దుపట్టాలు కళ్లు చెదిరిపోయే అందం తో ఉన్నాయి.

Leave a comment