Categories
Wahrevaa

ఈ గింజల్లో అంతులేని ఆరోగ్యం.

కొన్ని పండ్లలో ఎప్పుడూ తినాలని చుడము. పంటి కిందికి పొరపాటున వచ్చినా గబుక్కున ఊసేస్తాం. కానీ చాలా గింజల్లో అంటూ లేనన్ని ఆరోగ్య లాభాలున్నాయని చెపుతున్నారు డాక్టర్లు. పుచ్చపండులో ఎర్రని గుజులో నల్లని గింజలు నిండా ఉంటాయి. ఈ గింజల్ని మనమ తినం కానీ, ఇవి పుష్కలంగా ప్రోటీన్ తో నిండి ఉంటాయి. ఒక్క కప్పు గింజల్ని ఎండబెట్టి దాన్ని విశ్లేషిస్తే, ౩౦ గ్రాముల ప్రోటీన్ ఉంటుందిట. అది మనకు రోజుకు అవసరమయ్యే ప్రోటీన్ లో 61 శాతంగా అనుకోవచ్చు. ఆ గింజల్లోని మరో పోషకం ఆర్గనైన్. ఇది రక్త పోటును నియంత్రించడం కాకుండా గుండె జబ్బులు రానివ్వదు. ఇందులో వుండే మెగ్నీషియం 556మిల్లీ గ్రాములు. మనం తినే పిండి పదార్ధాలు సక్రమం గా జీర్ణమై ఒంటికి పట్టేలా చేస్తుంది. ఇవన్నీ మన జీవక్రియకు అత్యంత అవసరమైన ఖనిజాలు. ఇందులో బికాంప్లెక్స్ పుష్కలంగా వుంటుంది. ఇండులోని నియాసిన్ మన నాడీ వ్యవస్థల ఆరోగ్యానికి ప్రకాశావంతమైన చర్మ సౌందర్యం కోసం ఉపయోగ పడుతుంది.

Leave a comment