మొక్కలకి రంగురంగుల పూలు పూస్తాయి కానీ ఉదయాన్నే ఓ రంగులో పూసిన పూవులు సాయంత్రానికి మరో రంగులోకి పోతాయి చూశారా . పత్తి మందారం హిబిస్చుస్ మూటబిలిస్  దీని శాస్త్రీయ నామం. దీన్నే కాన్ఫిడరేట్ రోజ్ అనీ కాటన్ రోజ్ మాలో అని పిలుస్తారు . ఉష్ణోగ్రత వ్యత్యాసం ,పగటి కాంతిని బట్టె ఆయా సమయాల్లో పూవుల్లోని ఆంధోసైనిన్ ల పరిమాణంలోని హెచ్చుతగ్గుల వల్ల రంగులు పెరగటం ,తగ్గటం చేస్తాయి. వేళ్ళలో పుట్టిన ఆంధోసైనిన్లు అంటే వర్ణ ద్రవ్యాలు ,నేలలోని ఆమ్ల ,క్షార గుణాలను బట్టి పూవులు రంగులు మారిపోతాయి. తెల్లగా విరిసిన పత్తి మందార సూర్యాప్త సమయం అయ్యే సరికి గులాబీ రంగులోకి మారి పోవటానికి ఇదే కారణం .

Leave a comment